BDK: మణుగూరు పట్టణం సాయి బాబా గుడి ఎదురుగా యథేచ్ఛగా అడ్డగోలుగా ఫుట్పాత్ ఆక్రమణలు సాగుతున్నాయి. ఆ సెంటర్ ప్రధాన రహదారిఫై నలువైపులా బడ్డీలు, కంటైనర్లు విస్తరించాయి. ఫుట్పాత్ రోడ్డును ఆక్రమణలు సాగిస్తూ వ్యాపారం చేస్తున్నారు. సాయినగర్ బస్ స్టేజి వద్ద నిత్యం రద్దీగా ఉండే ఆ ఏరియాలో ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. అధికారులు స్పందించాలని స్థానికులు కోరారు.