పశ్చిమ బెంగాల్లో అసెంబ్లీ ఎన్నికలు పూర్తయ్యాక 60 రోజులపాటు కేంద్ర బలగాలను రాష్ట్రంలోనే ఉంచుతామని కేంద్రహోంమంత్రి అమిత్ షా వెల్లడించారు. దీదీ గూండాల భయం లేకుండా ప్రజలు రేపు తుది దశ పోలింగ్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఓటు బ్యాంకు రాజకీయాల కోసం అక్రమ చొరబాటుదారులను మమతా బెనర్జీ రక్షిస్తున్నారని విమర్శించారు. బెంగాల్లో BJP ప్రభుత్వ ఏర్పాటు ఖాయమన్నారు.