NLG: మిల్లర్లు, అధికారుల అండతో క్వింటాలకు 5 కేజీల అదనపు ధాన్యం వసూలు చేస్తూ రైతులను దోపిడీ చేస్తున్నారని ప్రజా పోరాట సమితి రాష్ట్ర అధ్యక్షుడు నూనె వెంకట్ స్వామి ధ్వజమెత్తారు. ఆయన చిట్యాల మండలం, వెలిమినేడు, పెద్దకాపర్తి, ఆరెగూడెంలలో ఇవాళ పర్యటించారు. తాలు పేరుతో సాగిస్తున్న ఈ “నల్ల” మార్కెట్ దోపిడీపై రాష్ట్ర అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు.