SRD: TGRJC ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు ఈనెల 28 నుంచి అందుబాటులో ఉంటాయని సంగారెడ్డి జిల్లా కోఆర్డినేటర్ చైతన్య తెలిపారు. విద్యార్థులు tgrjc.cgg.gov.in వెబ్సైట్ ద్వారా వీటిని డౌన్లోడ్ చేసుకోవచ్చని సూచించారు. మే 3న ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు పరీక్ష జరుగుతుందని వెల్లడించారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన అభ్యర్థులు గడువులోగా హాల్ టికెట్లు తీసుకోవాలి.