సత్యసాయి: జిల్లా నూతన ఎస్పీగా నియమితులైన సతీశ్ కుమార్ స్వస్థలం తమిళనాడు. బీటెక్ చదివిన ఆయన 2016లో ఐపీఎస్‌గా ఎంపికయ్యారు. తొలుత చింతపల్లి ఏఎస్పీగా పోస్టింగ్ పొందారు. తర్వాత నర్సీపట్నం ఓఎస్డీ, 2022లో అల్లూరి సీతారామరాజు ఎస్పీగా పదోన్నతి పొందారు. కాకినాడ, గుంటూరు జిల్లాల ఎస్పీగా పనిచేసిన ఆయన తాజాగా సత్యసాయి జిల్లాకు బదిలీ అయ్యారు.