BHNG: యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి ఆలయానికి విచ్చేసే భక్తుల సౌకర్యార్థం ఆరు నూతన స్వీయ సేవా కియోస్క్ యంత్రాలను ప్రారంభించారు. కెనరా బ్యాంక్ విరాళంగా అందించిన ఈ యంత్రాల ద్వారా భక్తులు క్యూలో నిలబడకుండానే దర్శనం, ప్రసాదాలు, వ్రతాల టికెట్లను డిజిటల్ పద్ధతిలో నేరుగా పొందవచ్చు. ఈ డిజిటల్ సేవలతో భక్తుల సమయం ఆదా అవడంతో పాటు, వేగవంతమైన సేవలు పొందవచ్చు.