ప్రకాశం: ఒంగోలులోని నెల్లూరు బస్టాండ్ వద్ద మున్సిపాలిటీ ఏర్పాటు చేసిన చెత్త డంపింగ్ యార్డ్‌కు గుర్తుతెలియని వ్యక్తులు శనివారం సాయంత్రం నిప్పు పెట్టారు. దీంతో మంటలు వ్యాపించి పొగ గృహాల వైపు రావడంతో స్థానికులు అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. ఫైర్ ఆఫీసర్ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు.