NLR: బోగోలు మండలంలోని కొండ బిట్రగుంట శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శనివారం సందర్భంగా విశేష పూజ కార్యక్రమాలను నిర్వహించారు. స్వామివారికి అభిషేకం తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. రాత్రి దేవస్థానం ఆలయ ఆవరణలో ఉంజల్ సేవ కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది.