WGL: వరంగల్ నగరంలోని ఓల్డ్ బీట్ బజార్ వద్ద సూరజ్ ఓయోలో పేకాట ఆడుతున్నారనే సమాచారం మేరకు బుధవారం రాత్రి టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.12,650 నగదు, ఆరు సెల్ఫోన్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు నిమిత్తం మట్వాడ పోలీసులకు అప్పగించినట్లు ఏసీపీ మధుసూదన్ తెలిపారు.