GNTR: పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా విద్యార్థులను తీర్చిదిద్దేందుకు ఏఎన్‌యూలో నేటి నుంచి ఈనెల 7 వరకు ‘విద్య-పరిశ్రమల సమ్మేళనం-2026’ నిర్వహిస్తున్నట్లు రెక్టార్ శివరాంప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి ఈ సమ్మేళనం ఎంతో దోహదపడుతుందన్నారు. ఇందులో భాగంగా మొత్తం 50 స్టాల్స్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.