SKLM: రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని రాష్ట్ర మంత్రి అచ్చెన్న నాయుడు స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్‌కు 6.22 లక్షల మెట్రిక్ టన్నుల యూరియా అవసరం ఉంటుందని అంచనా వేసి, ప్రభుత్వం ముందస్తు చర్యలతో 7.19 లక్షల మెట్రిక్ టన్నులను సిద్ధం చేసిందన్నారు. ఇప్పటి వరకు 6.41 లక్షల మెట్రిక్ టన్నులు రైతులకు పంపిణీ చేశామని తన సోషల్ మీడియా వేదిక ద్వారా తెలిపారు.