సిరిసిల్ల జిల్లా కేంద్రంలో ఈనెల 15న జరగనున్న భవన నిర్మాణ కార్మిక సంఘం 3వ మహాసభలను విజయవంతం చేయాలని సీఐటీయూ ట్రేడ్ యూనియన్ పిలుపునిచ్చింది. బోయిన్పల్లి మండలం కొత్తపేట గ్రామంలో మహాసభల పోస్టర్ను ఆవిష్కరించారు. జిల్లాలోని అన్ని మండలాల నుంచి కార్మికులు విస్తృతంగా హాజరై మహాసభలను విజయవంతం చేయాలని నాయకులు కోరారు.