హైదరాబాద్ లోని (hyderabad) కొన్ని ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది (rain in hyderabad). కోఠి, బేగంబజార్, అబిడ్స్, నాంపల్లి, బషీర్ బాగ్, నారాయణగూడ తదితర ప్రాంతాల్లో కాస్త జల్లులు కురియగా, ఖైరతాబాద్, లక్డీకాపూల్ వంటి ప్రాంతాల్లో భారీ వర్షం కురిసింది. దిల్ సుఖ్ నగర్, సరూర్ నగర్, చైతన్యపురి, సైదాబాద్, జగద్గిరిగుట్ట, బాలానగర్, తదితర ప్రాంతాల్లో వడగళ్ల వర్షం కురిసింది. సాయంత్రం నుండి అందరూ కార్యాలయాలు, దుకాణాల నుండి ఇళ్లకు వెళ్లే సమయంలో వర్షం కురువడంతో ద్విచక్ర వాహనదారులు, పాదచారులు మెట్రో పిల్లర్లు, వివిధ భవంతుల కింద తలదాచుకున్నారు. పలుచోట్ల విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. కొన్ని ప్రాంతాల్లో చెట్లు, స్తంబాలు విరిగి రోడ్లు మీద పడ్డాయి. వర్షం తగ్గిన తర్వాత ట్రాఫిక్ జామ్ అయి, వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఆయా ప్రాంతాల్లో ఉన్న ట్రాఫిక్ పోలీసులు కూలిన చెట్లను, స్తంభాలను రోడ్ల పై నుండి తొలగించారు. చెట్లు కూలి వాహనాలపై కూడా పడ్డాయి.