స్టార్ నటి తమన్నా నటించిన లేటెస్ట్ మూవీ ‘డూ యూ వాన్నా పార్ట్నర్’. దీని ప్రమోషన్లలో భాగంగా ఆమె మాట్లాడుతూ.. తనకు కాబోయే భాగస్వామి గురించి చెప్పుకొచ్చింది. ‘మంచి జీవిత భాగస్వామిగా ఉండేందుకు ప్రయత్నిస్తున్నాను. గత జన్మలో ఎంత పుణ్యం చేసుంటే నాకు తమన్నా లాంటి భార్య దొరికిందని నా భర్త ఆనందపడాలి. అయితే ఆ లక్కీ పర్సన్ ఎవరనేది తెలియదు. త్వరలోనే అతడిని చూస్తారేమో?’ అని చెప్పింది.