Sreeleela : ప్రస్తుతం టాలీవుడ్లో యంగ్ బ్యూటీ శ్రీలీల హవా నడుస్తోంది. ఇప్పటి వరకు ఈమె చేసిన సినిమాల్లో రెండు మాత్రమే రిలీజ్ అయ్యాయి. కానీ అప్పుడే ఏకంగా ఏడెనిమిది సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది ఈ క్యూట్ పిల్ల. అది కూడా ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా.. నాన్‌స్టాప్‌గా షూటింగ్‌లు చేస్తు ఫుల్ బిజీగా ఉంది.
ప్రస్తుతం టాలీవుడ్లో యంగ్ బ్యూటీ శ్రీలీల హవా నడుస్తోంది. ఇప్పటి వరకు ఈమె చేసిన సినిమాల్లో రెండు మాత్రమే రిలీజ్ అయ్యాయి. కానీ అప్పుడే ఏకంగా ఏడెనిమిది సినిమాల్లో ఛాన్స్ కొట్టేసింది ఈ క్యూట్ పిల్ల. అది కూడా ఏ మాత్రం గ్యాప్ ఇవ్వకుండా.. నాన్‌స్టాప్‌గా షూటింగ్‌లు చేస్తు ఫుల్ బిజీగా ఉంది. మరి ఒకేసారి ఇన్ని సినిమాల షూటింగ్స్ని శ్రీలీల ఎలా మ్యానేజ్ చేస్తోంది? ఇదే ఇప్పుడు మిగతా హీరోయిన్లకు అంతు పట్టకుండా పోతోంది. మామూలుగా చేతిలో రెండు మూడు పెద్ద సినిమాలుంటేనే.. వచ్చిన ఆఫర్లను రిజెక్ట్ చేస్తుంటారు హీరోయన్లు. కానీ శ్రీలీల మాత్రం అలా కాదు.. వచ్చిన ప్రతి ఆఫర్‌ని తన ఖాతాలో వేసుకుంటూ.. స్టార్ హీరోయిన్లకు సైతం ఆఫర్లు లేకుండా చేస్తోంది. పెళ్లి సందడితో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చి.. ధమాకా సినిమాతో మంచి హిట్ అందుకుంది శ్రీలీల. ప్రస్తుతం మహేష్ బాబు SSMB28, పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’, బాలయ్య-అనిల్ రావిపూడి ఎన్బీకె 108, రామ్-బోయపాటి సినిమాతో పాటు.. అనగనగా ఒక రాజు, వైష్ణవ్ తేజ్, నితిన్‌లతో సినిమాలు చేస్తోంది. ఈ సినిమాల్లో సగానికి పైగా సెట్స్ పై ఉన్నాయి. దీంతో ఒకేసారి ఇన్ని సినిమాల షూటింగ్ షెడ్యూల్స్‌ని శ్రీలీల ఎలా హ్యాండిల్ చేస్తుందనేది ఇంట్రెస్టింగ్గా మారింది. అది కూడా నిర్మాతలను ఏ మాత్రం ఇబ్బంది పెట్టకుండా.. డేట్స్ క్లాష్ అవ్వకుండా అంటే.. మామూలు విషయం కాదంటున్నారు. దాంతో శ్రీలీల నిజంగానే గ్రేట్ అంటున్నాయి ఇండస్ట్రీ వర్గాలు. అలాగే మిగతా బ్యూటీలు శ్రీలీలను చూసి నేర్చుకోవల్సిందేనని అంటున్నారు. ఏదేమైనా.. శ్రీలీల మాత్రం ఫుల్ స్వింగ్‌లో దూసుకుపోతోంది.