యంగ్ హీరోయిన్ శ్రీలీల(Sreeleela) గురువారం హైదరాబాద్(hyderabad)లో జరిగిన NBK108 సినిమా షూట్లో చేరారు. ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వం(anil ravipudi) వహిస్తుండగా..థమన్(thaman) మ్యూజిక్ అందిస్తున్నాడు.
కె రాఘవేంద్రరావు ప్రొడక్షన్ పెళ్లి సందడితో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన యంగ్ బ్యూటీ శ్రీలీల(Sreeleela) ఫుల్ బిజీగా మారింది. వరుసగా పెద్ద పెద్ద స్టార్ హీరోలతో సినిమాలు చేస్తూ దూసుకెళ్తుంది. ఇప్పటికే రవితేజతో కలిసి 2022 విడుదలైన ధమాకా చిత్రంలో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. రామ్ పోతినేని, నితిన్, పంజా వైష్ణవ్ తేజ్, పవన్ కళ్యాణ్, మహేష్ బాబు వరకు అందరు ప్రమఖ స్టార్లతో యాక్ట్ చేసేందుకు ఈ అమ్మడు ఇప్పటికే ఛాన్స్ కొట్టిసినట్లు తెలిసింది. అయితే ఈ చిత్రాలకు ముందే శ్రీలీల నందమూరి బాలకృష్ణ-దర్శకుడు అనిల్ రావిపూడి(anil ravipudi) చిత్రానికి ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.
ఈ క్రమంలో తాజాగా ఈ హీరోయిన్ శ్రీలీల గురువారం హైదరాబాద్‌లో జరిగిన NBK108 సినిమా షూట్(movie shoot)లో చేరారు. వరుస హిట్లతో దూసుకుపోతున్న నటి శ్రీలీల ఈ సినిమాలో చాలా కీలకమైన పాత్రను పోషిస్తోంది. అక్కడ ప్రధాన తారాగణంతో కూడిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరించారు. లొకేషన్లోని ఒక స్టిల్‌లో, బాలకృష్ణ(balakrishna)తో పాటు శ్రీలీల చిరునవ్వులు చిందించడం చూడవచ్చు. మరోవైపు శరత్‌కుమార్ కూడా ఈ చిత్రంలో కీలక పాత్ర పోషిస్తున్నారు.
గాడ్ ఆఫ్ మాస్ నటసింహ నందమూరి బాలకృష్ణ నటిస్తున్న ఈ చిత్రానికి స్టార్ డైరెక్టర్ అనిల్ రావిపూడి(anil ravipudi) దర్శకత్వం వహిస్తున్నారు. NBK108లో బాలకృష్ణ మార్క్ యాక్షన్, మాస్ ఎలిమెంట్స్ అన్ని ఉంటాయని అనిల్ రావిపూడి ఇప్పటికే పేర్కొన్నారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి, హరీష్ పెద్ది ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. బాలయ్య గత రెండు సినిమాలకు సంగీతం అందించిన ఎస్ థమన్(thaman)NBK108కి కూడా స్వరాలు సమకూరుస్తున్నారు. అఖండ సినిమాటోగ్రాఫర్ సి రామ్ ప్రసాద్ ఈ చిత్రానికి కెమెరా క్రాంక్ చేయగా, తమ్మి రాజు ఎడిటర్. రాజీవ్ ప్రొడక్షన్ డిజైనర్ కాగా, వి వెంకట్ యాక్షన్ డైరెక్టర్. క్రేజీ కాంబో బాలకృష్ణ, అనిల్ రావిపూడి, ఎస్ థమన్ ఆధ్వర్యంలో వస్తున్న ఈ చిత్రం రికార్డులు సృష్టించడానికి సిద్ధంగా ఉందని చెప్పవచ్చు.