»Closure Of Parks And Restaurants In That Area On 14th
HMDA : 14న ఆ ఏరియాలో పార్కులు, రెస్టారెంట్ల మూసివేత
బుద్ధ పూర్ణిమ ప్రాజేక్ట్ (Buddha Purnima Project) పరిధిలోని అన్ని పార్కులు, రెస్టారెంట్లను ఈ నెల 14న మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ అథారిటీ (HMDA) ఒక ప్రకటలో తెలిపింది. కొత్త సచివాలయ సమీపంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని(Ambedkar statue) శుక్రవారం సీఎం కేసీఆర్ (CM KCR) ఆవిష్కరించునున్నారు. ఈ సందర్బంగా ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్ఎండీఏ (HMDA) తెలిపింది.
ప్రజలకు అలర్ట్. రేపు ఒక్కరోజు మీరు ఆ ఏరియాలో రెస్టారెంట్ కి వెళ్లినా తినలేరు. పార్క్ కి వెళ్లినా తిరగలేరు. ఎందుకంటే రేపు వాటిని మూసివేస్తున్నారు. ఎందుకంటే? ఏప్రిల్ 14న పార్కులకు, సందర్శన స్థలాలకు, హోటల్స్ కు వెళ్లాలని అనుకుంటున్నారా? అయితే హైదరాబాద్ (Hyderabad) లో ఏ ఏరియాకు వెళ్లినా గానీ ఈ ఏరియాలో మాత్రం రేపు ఒక్కరోజు అన్ని మూసివేయబడతాయి. గో కార్టింగ్, పార్కులు, సందర్శన స్థలాలు, రెస్టారెంట్లు (Restaurants) సహా ఇతర సంస్థలు ఏమీ ఓపెన్ లో ఉండవు. ఎందుకంటే అధికారులు రేపు ఒక్కరోజు పలు సంస్థలను మూసి వేయాలని నిర్ణయించుకున్నారు. ప్రజల సౌకర్యం కోసమే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇటీవల హనుమాన్ జయంతి సందర్భంగా ఊరేగింపు సమయంలో గొడవలు జరగకూడదని ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో మద్యం షాపులను, పబ్ లను, ఫైవ్ స్టార్ హోటల్స్ ను మూసివేస్తూ హైదరాబాద్ పోలీసులు(police)నిర్ణయించిన విషయం తెలిసిందే.
ఇక రేపు కూడా కొన్ని సంస్థలను మూసివేయాలని హెచ్ఎండీఏ అధికారులు నిర్ణయించారు. బుద్ధ పూర్ణిమ ప్రాజేక్ట్ (Buddha Purnima Project) పరిధిలోని అన్ని పార్కులు, రెస్టారెంట్లను ఈ నెల 14న మూసివేస్తున్నట్లు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్ అథారిటీ (HMDA) ఒక ప్రకటలో తెలిపింది. కొత్త సచివాలయ సమీపంలో భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీ.ఆర్. అంబేద్కర్ విగ్రహాన్ని(Ambedkar statue) శుక్రవారం సీఎం కేసీఆర్ (CM KCR) ఆవిష్కరించునున్నారు. ఈ సందర్బంగా ప్రజల సౌకర్యార్థం ఈ నిర్ణయం తీసుకున్నట్లు హెచ్ఎండీఏ (HMDA) తెలిపింది. ఎన్టీఆర్ గార్డెన్, లుంబినీ పార్క్(Lumbini Park), ఎన్టీఆర్ ఘాట్, పిట్స్టాప్, జలవిహార్(Jalavihar), సంజీవయ్య పార్క్, అమోఘం రెస్టారెంట్ తదితర సందర్శన స్థలాలను మూసివేస్తున్నట్లు హెచ్ఎండీఏ పేర్కొంది.