Health Tips : ఇవి తింటే కీళ్ల నొప్పులు పరార్..లాభాలివే
వయసు పెరిగే కొద్దీ తీవ్ర ఆరోగ్య సమస్యలు వాటిల్లుతున్నాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు చాలా మంది వేధిస్తున్నాయి. సరైన ఆహారం తీసుకుంటే కీళ్ల నొప్పు(Joint Pains)లను తరిమికొట్టొచ్చు. మరి కీళ్ల నొప్పులకు ఎటువంటి ఆహారం తీసుకోవాలి? వాటి వల్ల లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఈరోజుల్లో చాాలా మంది అనేక అనారోగ్య సమస్యల(Health Problems)తో సతమతమవుతున్నారు. వయసు పెరిగే కొద్దీ తీవ్ర ఆరోగ్య సమస్యలు వాటిల్లుతున్నాయి. ముఖ్యంగా కీళ్ల నొప్పులు చాలా మంది వేధిస్తున్నాయి. సరైన ఆహారం తీసుకుంటే కీళ్ల నొప్పు(Joint Pains)లను తరిమికొట్టొచ్చు. మరి కీళ్ల నొప్పులకు ఎటువంటి ఆహారం తీసుకోవాలి? వాటి వల్ల లాభాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
కీళ్ల నొప్పులు(Joint Pains) తగ్గాలంటే చిరుధాన్యాలు(Millets) తీసుకోవడం ఉత్తమం. వీటిలో పోషకాలు అద్భుతంగా ఉంటాయి. ప్రోటీన్లు, ఫైబర్, విటమిన్లు, ఖనిజాలు చిరుధాన్యాలలో పుష్కలంగా ఉన్నాయి. చిరుధాన్యాలు తీసుకోవడం ద్వారా అందులోని పిండి పదార్థాలు జీర్ణక్రియ సాఫీగా సాగేలా చేస్తాయి. చిరు ధాన్యాలు తినడం వల్ల కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావన కలుగుతుంది. త్వరగా ఆకలి వేయదు. దీంతో బరువు(Weight) కూడా అదుపులో ఉంటుంది.
చిరుధాన్యా(Millets)లలో ముఖ్యంగా రాగులు, సజ్జలు వంటివి ఎముకల బలనానికి తోడ్పడుతాయి. కీళ్ల నొప్పుల సమస్యకు అవి మంచి పరిష్కారాన్ని చూపిస్తాయి. చాలా మంది కీళ్ల నొప్పుల(Joint Pains)తో బాధపడేవారికి ధాన్యాలను ఎక్కువగా తీసుకోకూడదని చెబుతుంటారు. అందులో ఉండే పిండి పదార్థాలు ఎక్కువగా శరీరంలోకి చేరి ఇంకాస్త బరువు పెరిగే అవకాశం ఉంటుందని చెబుతుంటారు. కానీ అది వాస్తవం కాదు. అదొక అపోహ మాత్రమే. ఎముకల బలానికి చిరు ధాన్యాలు తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
రాగులు, సజ్జల్లో వాపును తగ్గించే గుణం ఉంది. వీటిని తీసుకుంటే కీళ్ల నొప్పులు(Joint Pains) తగ్గుతాయి. రాగుల్లో కాల్షియం అధికంగా ఉంటుంది. వీటిని తరుచూ తీసుకుంటే ఎముకలు(Bones) క్షీణించడం, విరగడం వంటివాటి ముప్పు తగ్గుందని నిపుణులు సూచిస్తున్నారు. సజ్జల్లో ఫాస్పరస్ శాతం ఎక్కువగా ఉంటుంది. అది ఎముకల బలానికి తోడ్పడుతుంది. ఇన్ని ప్రయోజనాలున్న రాగులు, సజ్జలను తరచూ ఆహారంలో చేర్చుకుంటే మంచిదని నిపుణులు తెలుపుతున్నారు.