»These Are The Super Foods That Reduce Summer Heat
Health Tips : వేసవి తాపాన్ని తగ్గించే సూపర్ ఫుడ్స్ ఇవే
వేసవి(Summer)లో విపరీతమైన ఉక్కపోతతో ఇబ్బంది పడటం మామూలే. కొంతమందికి అయితే చెమటలు(Sweat) అలా కారుతూనే ఉంటూ అవస్థలు పడేలా చేస్తాయి. ఫ్యాన్(Fan), ఏసీ(AC), కూలర్(Cooler) కచ్చితంగా ఉండాల్సిందే. వేసవిలో చల్లని ఐస్ క్రీమ్స్(Ice creams), డ్రింక్స్‌తో ఇంకొందరు పొట్టను నింపుకుంటూ కూల్‌గా ఉంటారు. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్(Super Foods) ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవి(Summer)లో విపరీతమైన ఉక్కపోతతో ఇబ్బంది పడటం మామూలే. కొంతమందికి అయితే చెమటలు(Sweat) అలా కారుతూనే ఉంటూ అవస్థలు పడేలా చేస్తాయి. ఫ్యాన్(Fan), ఏసీ(AC), కూలర్(Cooler) కచ్చితంగా ఉండాల్సిందే. ఇవి లేకుంటే ఇంకొందరి వల్ల అస్సలు కాదు. వేసవిలో చల్లని ఐస్ క్రీమ్స్(Ice creams), డ్రింక్స్‌తో ఇంకొందరు పొట్టను నింపుకుంటూ కూల్‌గా ఉంటారు. అయితే ఆ చల్లనిదనం కొంతసేపు మాత్రమే ఉంటుంది. మరి వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి తీసుకోవాల్సిన సూపర్ ఫుడ్స్(Super Foods) ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం.
వేసవి(Summer)లో తక్కువగా నీరు తాగడం, నూనెలో వేయించిన ఆహారాలను ఎక్కువగా తీసుకోవడం వంటివి చాలా వరకూ తగ్గించాలి. ఆరోగ్యకరమైన ఆహారాలు(Healthy Foods) తీసుకోవడం ఎంతో ఉత్తమం. వేసవిలో శరీరంలోని వేడిని సహజంగా తగ్గించే కొన్ని సూపర్ ఫుడ్స్(Super Foods) ఉన్నాయి. వాటిని తీసుకుంటే మండే ఎండలో కూడా కూల్ కూల్‌గా ఉండొచ్చు. శరీరాన్ని చల్లబరిచే వాటిలో సబ్జా ప్రధానమైనది. సబ్జా గింజలను ఒక బాటిల్ నీటిలో వేసి తాగుతూ ఉంటే శరీరం చల్లగా ఉంటుంది. వేడి(Heat) తాపం అస్సలు తెలీదు.
ఖుస్ షర్బత్ శరీరాన్ని చల్లగా ఉంచడంలో సహాయపడుతుంది. ఖుస్ గడ్డి నుంచి ఈ ఖుస్ షర్బత్ ను తయారు చేస్తారు. శరీరంలోని అధిక వేడి వల్ల కళ్లు చాలా ఎర్రగా మారుతూ ఉంటాయి. ఆ ఫీలింగ్ తగ్గాలంటే ఖుస్ షర్బత్ తాగితే మంచి ఫలితం ఉంటుంది. కోకుమ్ ఫ్రూట్ జ్యూస్ తాగితే శరీరంలోని అధిక వేడి మాయమవుతుంది. ఇది బాడీలోని వేడి, మంటలను తగ్గించడంలో సాయపడుతుంది. అలాగే వడదెబ్బ తగలకుండా రక్షిస్తుంది.
బార్లీ నీరు కూడా శరీరంలోని వేడి(Heat)ని తగ్గిస్తుంది. అలాగే పుదీనా, కొత్తిమీర ఆకులు శరీరంలోని వ్యర్థాలను తొలగించడమే కాకుండా వేడిని తగ్గిస్తాయి. కొబ్బరి నీరు వేసవిలో తాగడం ఉత్తమం. అలాగే పుచ్చకాయ జ్యూస్, మజ్జిగ, కీరదోస వంటివి తీసుకుంటే మీరు చాలా కూల్ గా ఉంటారు. కొబ్బరి నీటి(Coconut water) వల్ల శరీరానికి ఎలక్ట్రోలైట్స్ వంటివి అందుతాయి. ఇవి కోల్పోయిన శక్తిని తిరిగి పొందేలా చేస్తాయి. పుచ్చకాయలో కూడా 90 శాతానికి పైగా నీరు ఉండటం వల్ల అది శరీరానికి బూస్టింగ్ ఎనర్జీని అందిస్తుంది. మజ్జిగ వల్ల ఎండ వేడి తాపం నుంచి బయటపడవచ్చు. శరీరంలో కోల్పోయిన ఎనర్జీని మజ్జిగ అందిస్తుంది. మజ్జిగ వల్ల రోగనిరోధక శక్తి(Immunity) కూడా పెరుగుతుంది.