ఎన్టీఆర్: కొండపల్లి మున్సిపాలిటీ పరిధిలోని పారిశ్రామిక వాడలో వేంచేసియున్న శ్రీ లక్ష్మీ గణపతి ఆలయం ప్రతిష్ట జరిగి పాతిక సంవత్సరాలు పూర్తి అయిన సందర్భంగా సోమవారం ఆలయంలో మహాకుంభాభిషేకం కన్నుల పండువగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైలవరం ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు ఆయనకు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.