బ్లాక్ బస్టర్ ‘అఖండ’కు సీక్వెల్‌గా బోయపాటి శ్రీను, నందమూరి బాలకృష్ణ కాంబోలో తెరకెక్కిన ‘అఖండ-2’ మూవీపై భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా నుంచి రెండో పాట ‘జాజికాయ జాజికాయ’ను విడుదల చేయడానికి టీమ్ సిద్ధమైంది. ఈ రొమాంటిక్ సాంగ్‌లో సంయుక్తతో పాటు బాలయ్య కూడా స్టెప్పులేశారు. ఈ పాటను రేపు సా.5 గంటలకు వైజాగ్‌లోని జగదాంబ థియేటర్లో విడుదల చేయనున్నారు.