KRNL: కేంద్ర విద్యుత్, గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్ లాల్ కర్నూలుకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు జిల్లా కలెక్టర్ డా.ఏ. సిరి, ఎంపీ బస్తిపాటి నాగరాజు, ఎస్పీ విక్రాంత్ పాటిల్, ఆర్డీవో సందీప్ స్వాగతం పలికారు. అనంతరం ఆయన హెలికాప్టర్లో గ్రీన్ కో ప్రాజెక్టును సందర్శించేందుకు వెళ్లారు. ఇందులో భాగంగా పలువురు అధికారులు పాల్గొన్నారు.