ELR: రెడీమేడ్ ప్రభావంతో టైలర్లు వృత్తిలో ఇబ్బందులు పడటం వాస్తవమేనని ఏపీ రాష్ట్ర టైలర్స్ అభివృద్ధి సహకార శాఖ సమాఖ్య ఛైర్మన్ ఆకాశపు స్వామి అన్నారు. ఇవాళ ఉంగుటూరులో ఆయన మాట్లాడారు. గత ప్రభుత్వం టైలర్లకు ఏడాది రూ. 10వేలు ఇచ్చిన పథకాన్ని అమలు చేయాలని సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానన్నారు . టైలర్లను ఆదుకునేందుకు ఆదరణ పథకం ద్వారా కుట్టు మిషన్ అందించాలని కోరారు.