»Heart Attack Haunting The Youth They Are At High Risk
Heart Attacks: యువతను వెంటాడుతున్న ‘హార్ట్ ఎటాక్’..వారికే అధిక రిస్క్
ఈమధ్య కాలంలో చాలా మందిని గుండె సమస్యలు(Heart Problems) వేధిస్తున్నాయి. వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్(Heart Attack) బారిన పడుతున్నవారు పెరుగుతున్నారు. కరోనా(Corona) తర్వాత గుండె పనితీరులో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఏడాది కాలంలోనే హార్ట్ ఎటాక్ కేసులు యువత(Youth)లో అధికంగా పెరిగాయి. ముఖ్యంగా పట్టణ ప్రాంతాల్లో నివశించేవారికి ఈ ముప్పు అధికంగా ఉందని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. హార్ట్ ఎటాక్(Heart Attack)తో మరణిస్తున్నవారి వివరాలు గమనిస్తే వారంతా కూడా గతంలో కరోనా(Corona) బారిన పడినట్లుగా వైద్యుల పరిశోధనల్లో తేలింది.

కుటుంబ సభ్యుల్లో గుండె జబ్బులు(Heart Dieseases) ఉండి, వాటికి ఇతర రిస్కు సమస్యలు తోడైతే అటువంటివారికి ఆరోగ్య పర్యవేక్షణ ముఖ్యమని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ప్రతి మాసంలో ఇటువంటి తరహా కేసులు 10 నుంచి 25 వరకూ తమ వద్దకు వస్తున్నాయని కార్డియాలజిస్టులు వెల్లడిస్తున్నారు. కరోనాకు ముందు ఇలాంటి కేసుల సంఖ్య చాలా తక్కువగా ఉండేదని, ఆ సంఖ్య ఇప్పుడు పెరిగిందని వైద్యులు నిర్దారిస్తున్నారు.
హైదరాబాద్ నగరంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో 15 ఏళ్ల బాలుడికి వైద్యులు(Doctors) స్టెంట్ వేయాల్సిన పరిస్థితి వచ్చింది. ఆ బాలుడి కుటుంబీకుల్లో గతంలో గుండె జబ్బుల(Heart Problems) చరిత్ర ఉండేది. కరోనా(Corona) రెండో వేవ్ లో ఆ బాలుడు కరోనా బారిన పడ్డాడని వైద్యులు గుర్తించారు. ఫ్రెండ్స్ తో కలిసి గుడికి వెళ్లగా ఛాతిలో నొప్పి రావడంతో అతడికి యాంటాసిడ్ టాబ్లెట్ ఇచ్చారు. అయినప్పటికీ తగ్గకపోవడంతో అతడిని పరీక్ష చేయగా స్టెంట్ వేయాల్సి వచ్చినట్లుగా వైద్యులు తెలిపారు.
కుటుంబీకుల్లో గతంలో తాతలు, నాన్నమ్మలు, ఇలా ముందు తరాల వారికి ఎవరికైనా గుండె జబ్బులు(Heart Problems) ఉన్నా అటువంటి కుటుంబంలోని వారు పొగతాగడం(Smoking), డ్రగ్స్(Drugs) సేవించడం, ఫాస్ట్ ఫుడ్(Fast Foods)కు అలవాటు పడటం వంటివి చేస్తుంటే వారు చిన్న వయసులోనే గుండె జబ్బుల బారిన పడే అవకాశం కచ్చితంగా ఉందని వైద్యులు నిర్ధారించారు. కాబట్టి యువత తస్మాత్ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. మూడు పూటలా ఇంటి భోజనం చేస్తూ, ఫాస్ట్ ఫుడ్స్ తినడం తగ్గించాలని వైద్యులు తెలుపుతున్నారు. తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాలని, వారి ఆహార శైలి, దినచర్య, అలవాట్లను ఒక కంట కనిపెడుతూ ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు.