W.G: పెనుమంట్ర మండలం బ్రాహ్మణచెరువు గ్రామంలో సోమవారం కుష్ఠు వ్యాధి నిర్ధారణ శిబిరం నిర్వహించారు. ఏఎన్ఎం లక్ష్మి, ఆశ సిబ్బంది ఇంటింటికీ వెళ్లి కుష్ఠు వ్యాధి మచ్చలపై పరీక్షలు చేశారు. వ్యాధి నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించి, అనుమానిత మచ్చలు కనిపిస్తే ప్రభుత్వ వైద్యులను సంప్రదించాలని సూచించారు.