»Alert For Those Who Use Smartphone Too Much That Danger Is Inevitable
Health Tips : స్మార్ట్ఫోన్ అతిగా వాడే వారికి అలర్ట్..ఆ ప్రమాదం తప్పదు!
ఈరోజుల్లో చాలా మందికి స్మార్ట్ ఫోన్ (Smart Phones) వాడకం అత్యవసరమైంది. కరోనా (Corona) మహమ్మారి తర్వాత ఆన్లైన్ క్లాసుల పద్ధతి పెరిగింది. దీంతో చాలా మంది స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడ్డారు. ముఖ్యంగా యువత (Youth) విపరీతంగా స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ చూస్తూ చాలా సమయం గడుపుతుండటంతో అనేక అనారోగ్య సమస్యలు (Health Problems) ఎదురవుతున్నాయి.
ఈరోజుల్లో చాలా మందికి స్మార్ట్ ఫోన్ (Smart Phones) వాడకం అత్యవసరమైంది. కరోనా (Corona) మహమ్మారి తర్వాత ఆన్లైన్ క్లాసుల పద్ధతి పెరిగింది. దీంతో చాలా మంది స్మార్ట్ ఫోన్లకు అలవాటు పడ్డారు. ముఖ్యంగా యువత (Youth) విపరీతంగా స్మార్ట్ ఫోన్లను వినియోగిస్తున్నారు. స్మార్ట్ ఫోన్ స్క్రీన్ చూస్తూ చాలా సమయం గడుపుతుండటంతో అనేక అనారోగ్య సమస్యలు (Health Problems) ఎదురవుతున్నాయి. శాస్త్రవేత్తల పరిశోధనల ప్రకారం స్మార్ట్ ఫోన్లను వాడుతున్నవారు విపరీతమైన వెన్ను నొప్పి (Back Pain)తో బాధపడుతున్నట్లు గుర్తించారు.
స్మార్ట్ ఫోన్ (Smart Phones) అతిగా వినియోగించడం వల్ల వెన్నెముక ఆరోగ్యం (Back Pain)పై తీవ్ర ప్రభావం చూపుతోంది. ముఖ్యంగా రోజుకు మూడు గంటల కంటే ఎక్కువ సమయం స్క్రీన్స్ చూస్తుండటం లేదా ఒకే భంగిమలో కూర్చోని ఉండటంతో వెన్నెముక సమస్యలు తలెత్తుతున్నాయి. ఈ విషయం అధ్యయనంలో తేలడంతో నిపుణులు యువతను హెచ్చరిస్తున్నారు.
వెన్నెముక ఛాతి వెనుక భాగంలో, భుజాల మధ్య, మెడ దిగువ నుంచి నడుము వెన్నెముక ప్రారంభవం వరకూ కూడా నొప్పులనేవి ఏర్పడుతున్నాయి. శాస్త్రవేత్తలు 14 నుంచి 18 ఏళ్ల మధ్య వయస్సున్న మగ, ఆడ విద్యార్థులపై సర్వే చేశారు. ఈ సర్వేలో 1628 మంది పాల్గొనగా వీరంతా కూడా అధికంగా ఫోన్ వినియోగించడం వల్ల వెన్నెముక సమస్యతో బాధపడుతున్నట్లు తేలింది. మగవారితో పోలిస్తే ఆడవారిలో ఎక్కువగా ఈ ప్రభావం కనిపించినట్లు పరిశోధకులు గుర్తించారు.
స్మార్ట్ ఫోన్ (Smart Phones) అతిగా వినియోగించడం వల్ల కళ్లకు, వెన్నెముకకు తీవ్ర ఇబ్బంది అనేది ఎదురవుతోంది. అంతేకాకుండా ఆలోచనా శక్తి కూడా మందగిస్తోందని పరిశోధకులు తెలిపారు. మగవారిలో స్పెర్మ్ కౌంట్ కూడా తగ్గుతోందని, అలాగే చురుకుదనం కోల్పోతున్నట్లు వెల్లడైంది. కాబట్టి స్మార్ట్ ఫోన్ కు దూరంగా ఉండటం ఎంతో మంచిది. ముఖ్యంగా యువత స్మార్ట్ ఫోన్ వినియోగం తగ్గించాలని పరిశోధకులు సూచిస్తున్నారు.