ఒక మహిళ తాను స్విగ్గీ నుండి ఆర్డర్ చేసిన వెజ్ బిర్యానీలో మాంసం ముక్క వచ్చింది (Meat piece in veg biryani). దీంతో ఆమె దీనిని సోషల్ మీడియా అనుసంధాన వేదిక ట్విట్టర్లో షేర్ చేసింది (woman shared picture of a piece of meat in twitter). ఇలాంటి ఘోరమైన తప్పులు.. ప్రత్యేకంగా తన నమ్మకాల విషయానికి వస్తే ఆమోదయోగ్యం కాదని పేర్కొన్నారు. ఆమె ట్వీట్‌పై స్విగ్గీ (Swiggy) కూడా స్పందించింది. తమ రెస్టారెంట్ భాగస్వాముల నుండి ఇలాంటి మిక్స్-అప్లు ఎప్పుడు ఊహించలేదని, మేము దీన్ని నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పింది.
నటాషా భరద్వాజ్ (Natasha Bharadwaj) మొన్న స్విగ్గీ (swiggy) నుండి వెజ్ బిర్యానీని ఆర్డర్ చేసింది. అయితే బిర్యానీలో మాంసం ముక్క ఉండటాన్ని చూసి షాక్ కు గురైంది. ఫిర్యాదు చేయడానికి ట్విట్టర్ హ్యాండిల్ ను ఉపయోగించారు. స్విగ్గీని ట్యాగ్ చేస్తూ ఈ వెజ్ బిర్యానీని పోస్ట్ చేశారు. ఎవరైనా శాఖాహారులు స్విగ్గీ ద్వారా ఫుడ్ ఆర్డర్ చేయాలని అనుకుంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించాలని పేర్కొన్నారు. ఇదే అంశం గురించి తాను స్విగ్గీ ఎగ్జిక్యూటివ్ ను అడిగానని…. అది నాన్ వెజ్ టేరియన్ రెస్టారెంట్ అని, కానీ వెజ్ టేరియన్ అని ఎలా చెప్పారో తనకు తెలియదని చెప్పాడని పేర్కొన్నారు. సంబంధిత రెస్టారెంట్ నుండి తాము వివరణ కోరుతామని స్విగ్గీ చెప్పినట్లు తెలిపారు. తాను స్విగ్గీ ఎగ్జిక్యూటివ్ తో జరిపిన సంభాషణ రికార్డింగ్ ను కూడా పంపించానని ఆమె తెలిపారు.
ఫుడ్ డెలివరీ యాప్స్ స్విగ్గీ మరియు జొమాటో.. ఈ రెండూ అందరికీ తెలిసిందే. 2020లో కరోనా నేపథ్యంలో లాక్ డౌన్ విధించారు. ఆ తర్వాత నిత్యావసరాల కోసం తప్ప… బయటకు వెళ్లకూడదని ఆంక్షలు వచ్చాయి. రెస్టారెంట్లు, ట్రాలీ షాపులు మూతపడ్డాయి. ఆ తర్వాత రెస్టారెంట్లలో ఆహారం తీసుకోకుండా నిషేధం విధించి కేవలం పార్శిల్ సర్వీస్ మాత్రమే కొనసాగించవచ్చని ప్రకటించారు. లాక్డౌన్ సమయంలో చాలామంది ఉద్యోగులు ఇంటి నుంచే పని చేశారు. ఇంట్లో వంట చేయలేని వ్యక్తులు స్విగ్గీ (swiggy), జొమాటో (Zomoto) వంటి యాప్‌ల ద్వారా ఆహారాన్ని ఆర్డర్ చేసేవారు. 2020 నుండి ఇప్పటి వరకు, ప్రజలు ఆహారాన్ని ఆర్డర్ చేసే అలవాటును వదులుకోలేదు. మొదటి నుండి ఈ యాప్స్ అందుబాటులో ఉన్నప్పటికీ… కరోనా తర్వాత వీటికి డిమాండ్ బాగా పెరిగింది.