KDP: రంజాన్, ఉగాది పండుగల సందర్భంగా రేషన్ కార్డుదారులందరికీ కందిబేడలు, గోధుమపిండి, పామాయిల్, చక్కెర వంటి నిత్యావసర సరుకులు ఇవ్వాలని సీపీఎం కడప నగర కార్యదర్శి రామమోహన్ డిమాండ్ చేశారు. అర్హులైన పేద ముస్లింలందరికీ రంజాన్ తోఫా ఇవ్వాలని కోరారు. రేషన్ డీలర్లు అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ వారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.