KKD: బడి ఈడు పిల్లలంతా నూరు శాతం పాఠశాలలోనే ఉంటూ విద్యను అభ్యసించాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం పలు పథకాలను అమలు చేస్తుందని CDPO వై. లక్ష్మి పేర్కొన్నారు. రమణయ్యపేటలో అడబాల ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రపంచ అక్షరాస్యత దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగిన అవగాహన కార్యక్రమాన్ని ఉద్దేశించి ఆమె మాట్లాడారు. అంగన్వాడీల ద్వారా పిల్లలకు విద్య అందిస్తున్నట్లు పేర్కొన్నారు.