KMM: కూసుమంచి మండలం నాయకన్ గూడెంలో రూ. 20 లక్షల వ్యయంతో నిర్మించిన నూతన గ్రామపంచాయతీ కార్యాలయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గ్రామపంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించడం సంతోషంగా ఉందని తెలిపారు. రాష్ట్రంలోని గ్రామాల అభివృద్ధికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని, ఇందుకోసం అన్ని విధాలా కృషి చేస్తామని పేరొన్నారు.