ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇప్పటివరకు 70 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 781 మంది ఓటర్లు ఉండగా.. ప్రస్తుత సమయం వరకు 528 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్ కొనసాగనుంది. పోలింగ్ ముగిసిన వెంటనే కౌంటింగ్ ప్రారంభిస్తారు. కాగా, ఎన్డీయే నుంచి రాధాకృష్ణన్, ఇండి కూటమి నుంచి బి.సుదర్శన్ రెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే.