NLR: రెవెన్యూ డివిజన్ పరిధిలోని రేషన్ డీలర్లకు ప్రభుత్వం కొత్త టచ్ స్క్రీన్ మిషన్లను పంపిణీ చేసింది. నెల్లూరు అర్బన్ MRO కార్యాలయంలో సుమారు 300 మంది డీలర్లకు ఈ మిషన్లను అందజేశారు. గతంలో ఉన్న బటన్ మిషన్ల వల్ల రేషన్ సరుకులు ఇవ్వడంలో ఇబ్బందులు పడేవారు. ఇప్పుడు టచ్ స్క్రీన్ ఉండటంతో నెంబర్లను సులభంగా ఎంటర్ చేయవచ్చని అధికారులు తెలిపారు.