W.G: నియోజకవర్గంలో అక్రమ ఇసుక మాఫియాను అడ్డుకుంటామని నరసాపురం పార్లమెంట్ వైసీపీ ఇంచార్జ్ గూడూరి ఉమాబాల సోమవారం తెలిపారు. ఆచంటలో జరుగుతున్న అరాచకాలపై వైసీపీ సీనియర్ నాయకులు ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. అక్రమ ఇసుక రవాణాపై పార్టీ పరంగా చేస్తున్న పోరాటానికి మద్దతు ఉంటుందని, జిల్లా పార్టీ పెద్దలు, కమిటీతో మాట్లాడి పోరాటం చేసేలా కృషి చేస్తామన్నారు.