ASF: పెద్దపులి దాడిలో హతమయిన కాగజ్ నగర్ మండలం గన్నారంకి చెందిన మోర్లే లక్ష్మి అనే మహిళ ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకోవాలని MLA హరీష్ బాబు జిల్లా ఇంచార్జ్ మంత్రి జూపల్లిని కలిసి కోరారు. నగదుతో పాటు 5 ఎకరాల సాగుభూమి ఇస్తామని ఉన్నతాధికారులు ఒప్పుకున్నారని గుర్తు చేశారు. సానుకూలంగా స్పందించిన మంత్రి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.