MLG: విద్యార్థులకు అందించే, పౌష్టికాహారం విషయంలో ఎలాంటి రాజీ ఉండరాదని కలెక్టర్ దివాకర అధికారులను ఆదేశించారు. లోపాలు బయటపడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీఈవో, ఐటీడీఏ ఏపీవో, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వెల్ఫెర్ అధికారులతో తన ఛాంబర్లో సోమవారం సమావేశమయ్యారు. నాణ్యమైన వైద్య సేవలు అందించాలని, విద్యార్థుల భద్రతపై నిత్యం పర్యవేక్షణ ఉండాలని కలెక్టర్ సూచించారు.