Vivo Y100A Colour Changing Design Launched in India
Vivo Y100A:మిడ్ సెగ్మెంట్‌పై వివో (Vivo) ఫోకస్ చేసింది. అన్నీ ఫీచర్లు ఇస్తూ.. వినియోగదారులను ఆకట్టుకోవాలని చూస్తోంది. ఇప్పటికే వివో వై 100 (vivo y 100) మొబైల్ ఉండగా.. వివో వై 100 ఏ (Vivo Y100A) పేరుతో మరో ఫోన్ తీసుకొచ్చింది. మొబైల్ ఇండియాలో లాంఛ్ చేశారు. ఫీచర్లను (features) కంపెనీ రిలీజ్ చేసింది. ధర వివరాలు మాత్రం ఇంకా ప్రకటించలేదు.
వివో వై100 ఏ (Vivo Y100A) కలర్ ఛేంజింగ్ మొబైల్.. ఫసిఫిక్ బ్లూ, ట్విలైట్ గోల్డ్ కలర్ మాత్రమే కలర్ ఛేంజ్ అవుతాయి. మెటల్ బ్యాక్ (metal black) కలర్ మాత్రం అలాగే ఉంటుంది. 6.39 ఇంచుల ఫుల్ హెచ్డీ ఫ్లస్ ఆమోలెడ్ డిస్ ప్లే ఇచ్చారు. క్వాల్ కామ్ స్నాప్ డ్రాగన్ 695 ఎస్వోసీ రన్ అవుతుంది. మొబైల్ 8 జీబీ ర్యామ్ 256 జీబీ ర్యామ్ స్టోరెజ్ ఇచ్చారు. 4500 ఎంఏహెచ్ బ్యాటరీ ఇవ్వగా.. 44 వాట్స్ ఫ్లాష్ ఛార్జ్ అవుతుంది. ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్ మీద మొబైల్ రన్ అవుతుంది.
64 మెగా పిక్సెల్ ప్రైమరీ కెమెరా ఇచ్చారు. డ్యుయల్ 2 మెగా పిక్సెల్ కెమెరా ఏర్పాటు. సెల్ఫీల కోసం 16 మెగా పిక్సెల్ కెమెరా ఉంది. వివో ఇండియా ఈ-స్టోర్స్‌లో (vivo india e stores) మొబైల్ విక్రయాలు జరుగుతాయి. డ్యుయల్ సిమ్స్ 5జీ నెట్ వర్క్ సపోర్ట్ చేస్తాయి. ధర వివరాలు ఇప్పటివరకు ప్రకటించలేదు.