రానున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో (telangana assembly elections) ఉమ్మడి పాలమూరు జిల్లా నుండి పదమూడు స్థానాల్లో బీఆర్ఎస్ వ్యతిరేకులు గెలుస్తారని మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు (jupalli krishna rao) సంచలన వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఆయన కొల్లాపూర్ లో (kollapur assembly constituency) మీడియాతో మాట్లాడారు. ఇప్పటికే రెండుసార్లు బీఆర్ఎస్ కు (BRS) ఎక్కువ అయిందని, మూడోసారి తెలంగాణను పాలించే హక్కు ఆ పార్టీకి లేదన్నారు. బీఆర్ఎస్ నేతలు (BRS leaders) వచ్చే ఎన్నికల్లో గెలవకుండా కార్యాచరణతో ముందుకు సాగుతామన్నారు. వ్యక్తులతో కలిసా లేదా పార్టీతో కలిసా అనేది మున్ముందు తెలుస్తుందని చెప్పారు. ఆత్మీయ సమ్మేళనాలకు ఎవరు పిలిచినా తాను వెళ్తానని, అలాగే తప్పులను ప్రశ్నిస్తూనే ఉంటానని చెప్పారు. తన పైన ఎన్ని దాడులు జరిగినా ఎవరి పైనా కేసులు పెట్టలేదని, ఇప్పుడు తాను ఎక్కడ కనిపించినా కేసులు పెడుతున్నారని మండిపడ్డారు. ఎంపీ, ఎమ్మెల్సీ ఎన్నికల్లో సంపూర్ణంగా సహకరించామన్నారు. తన సహకారం వల్లే ఎమ్మెల్సీ ఎన్నికల్లో రెండు ఎకగ్రీవం అయ్యాయన్నారు. కానీ కేసులతో తన అనుచరులను ఇబ్బంది పెట్టారన్నారు. మంత్రి కేటీఆర్ కు అన్ని సమస్యలు వివరించారనని చెప్పారు.
తనకు భావప్రకటనా స్వేచ్ఛ ఉన్నదని, తప్పు చేసినప్పుడు సొంత పార్టీ అయినా నిలదీస్తానని చెప్పారు. తాను అడిగిన ప్రశ్నలకు మంత్రి నిరంజన్ రెడ్డి (niranjan reddy) ఇప్పటి వరకు ఎలాంటి సమాధానం చెప్పలేదన్నారు. తనకు మూడేళ్లుగా పార్టీ సభ్యత్వ పుస్తకాలు ఇవ్వలేదని, అసలు పార్టీ బాధ్యతలు ఇవ్వకుండా సస్పెండ్ చేయడం ఏమిటని ప్రశ్నించారు. పార్టీ నండి తనను సస్పెండ్ చేయడం సంతోషంగా ఉందన్నారు. దీంతో తన గౌరవం పెరిగిందని చెప్పారు. తెలంగాణ కోసం (telangana agitation) పోరాడిన తాను… తెలంగాణ వద్దన్న నేత వద్దకు వెళ్లి సభ్యత్వం తీసుకోవాలా అని నిలదీశారు. తలవంచడం కాదని.. జనమే ఈ ప్రభుత్వం మెడలు వంచుతారన్నారు.
ఎవరు సరైన ఉద్యమకారులో తేల్చుకునేందుకు తెలంగాణ ఉద్యమం సమయంలో నిరంజన్ రెడ్డి పైన ఎన్ని కేసులు ఉన్నాయి.. తన పైన ఎన్ని కేసులు ఉన్నాయో చూద్దామా అని సవాల్ చేశారు. తాను అమ్ముడుపోయిన వస్తువును కాదన్నారు. కొల్లాపూర్ లో 2004లో నిరంజన్ రెడ్డికి డిపాజిట్ రాలేదన్నారు. ఆయన వ్యవహారం వనపర్తిలోనే బయట పెడతానని, ఆయనకు మంత్రి పదవి కూడా తన వల్లే వచ్చిందన్నారు. ప్రభుత్వానికి అవసరమైన ఎమ్మెల్యేలు ఉండగా కొత్తగా 12 మందిని ఎందుకు చేర్చుకున్నారో చెప్పాలన్నారు. తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీని ఖతం చేసేందుకేనా అన్నారు.