భూపాలపల్లి జిల్లాలో రైతులు పెట్టుబడి సాయం అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వం వెంటనే రైతుబంధు నిధులను విడుదల చేయాలని సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి జి.సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. జిల్లా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ.. యూరియా యాప్‌తో రైతులు పడుతున్న ఇబ్బందులను తొలగించి, ప్రత్యామ్నాయ మార్గాల్లో ఎరువులను అందించాలని కోరారు.