SDPT: అక్కన్నపేట మండలం రామవరం గ్రామంలో గ్రామ పంచాయతీ ఆధ్వర్యంలో పదవ వార్డులో ప్రజలకు నీటి ఇబ్బందుల దృష్ట్యా ఇవాళ నూతన మోటార్‌ను బిగించారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మాట్లాడుతూ.. ప్రజలకి ఇబ్బంది లేకుండా నీటి సౌకర్యాన్ని కల్పించాం. అలాగే గ్రామంలోని ప్రతి సమస్య తీరుస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో వార్డ్ సభ్యులు, గ్రామపంచాయతీ కార్యదర్శి, గ్రామస్తులు పాల్గొన్నారు.