KRNL: కర్నూలు జిల్లా పోలకల్కు చెందిన రైతులు కృష్ణ, వెంకట్ నాయుడులు ఉల్లి పంటకు గిట్టుబాటు ధర లేక మనస్తాపానికి గురై, సెల్ఫీ వీడియోతో పురుగుల మందు తాగారు. ఈ ఘటనపై ఆదివారం సి. బెళగల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పలుకుదొడ్డి గ్రామ వీఆర్వో శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు ఈ కేసు నమోదైనట్లు ఎస్సై పరమేష్ నాయక్ తెలిపారు.