CTR: పుంగనూరు వ్యవసాయశాఖ డివిజన్ పరిధి అన్ని మండలాల్లోని రైతు సేవా కేంద్రాల్లో యూరియా పంపిణీ చేస్తున్నట్లు ఏడీ శివకుమార్ తెలిపారు. పుంగనూరు, చౌడేపల్లె, సోమల, సదుం, రొంపిచెర్ల, పులిచెర్లతో పాటు పెద్ద పంజాణి, గంగవరం మండలాల రైతులకు బయో మెట్రిక్ ద్వారా 601 టన్నుల యూరియాను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. అనంతరం రైతులు పాసుపుస్తకాలు, ఆధార్ జిరాక్స్ ఇవ్వాలన్నారు.