MDK: భారీ వర్షాలకు నష్టపోయిన రైతుల కుటుంబాలను ఆదుకోవాలని ఆదివారం మాజీ ఎమ్మెల్యే పద్మా దేవేందర్ రెడ్డి అన్నారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో రైతులకు రైతుబంధు, రైతు భరోసా, రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరను కల్పించిందన్నారు. పంట నష్టపోయిన రైతులకు రూ. 10 వేల నష్టపరిహారం అందించాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు.