VSP: విశాఖలోని జీవీఎంసీ 88వ వార్డులో ఉన్న టిడ్కో గృహాలకు మౌలిక సదుపాయాలు కల్పించడంలో ప్రభుత్వాల నిర్లక్ష్యాన్ని సీపీఐ విశాఖ జిల్లా సహాయ కార్యదర్శి కసిరెడ్డి సత్యనారాయణ తీవ్రంగా ఖండించారు. ఆదివారం టిడ్కో హౌసింగ్ ప్రాజెక్టు సముదాయంలో లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ఇళ్లు నిర్మించి పదేళ్లు గడిచినా, లబ్ధిదారులకు కేటాయించకపోవడం దారుణమన్నారు.