ప్రకాశం: మార్కాపురం నియోజకవర్గ ప్రజలకు నకిలీ పథకాలపై BJP ఇన్ఛార్జ్ పీవీ కృష్ణారావు హెచ్చరికలు చేశారు. ఈ మేరకు విశ్వకర్మ పథకంలో నగదు జమ చేస్తామని GST కట్టమని ఫేక్ కాల్స్ వస్తున్నాయని చెప్పారు. అటువంటి విషయాలాలో మహిళలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. అనంతరం కేంద్ర ప్రభుత్వం ముందుగా డబ్బులు కట్టమని ఎవరికీ చెప్పదని ఎవరినీ నమ్మవద్దని తెలిపారు.