ప్రకాశం: జిల్లాలోని పలు ప్రముఖ ఆలయాల దర్శనాలను ఆలయాల ఈవోలు నిలిపివేశారు. ఈ మేరకు నేడు చంద్రగ్రహణం కారణంగా దర్శనాల నిలిపివేతపై ఆలయాల అధికారులు ప్రకటనలు జారీ చేశారు. ప్రధానంగా జిల్లాలోని భైరవకోనలో వెలసిన శ్రీ భైరవేశ్వర ఆలయం, త్రిపురాంతకంలోని శ్రీ త్రిపురాంతకేశ్వరస్వామి ఆలయం, మార్కాపురంలోని శ్రీ చెన్నకేశవస్వామి ఆలయం, పలు ఆలయాల దర్శనాలను నిలిపివేశారు.