BDK: లక్ష్మీదేవి పెళ్లి మండలం సీపీఐ పార్టీ కార్యాలయంలో కార్యవర్గ సభ్యులు ఆదివారం సమావేశం అయ్యారు. ఈ కార్యక్రమానికి సీపీఐ జిల్లా కార్యదర్శి ఎస్. కే సాబీర్ పాషా పాల్గొని మాట్లాడుతూ.. మండలంలో పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్క కార్యకర్త నడుం బిగించాలని తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికలలో గెలుపే లక్ష్యంగా ప్రతి కార్యకర్త సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.