అనంతపురంలోని కిమ్స్ సవేరా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కళ్యాణదుర్గం మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయ చౌదరిని టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు గుండుమల తిప్పేస్వామి పరామర్శించారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. హనుమంతరాయ చౌదరి త్వరగా కోలుకోవాలని తిప్పేస్వామి ఆకాంక్షించారు.