E.G: రాజమండ్రి రూరల్ మండలం ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్ద గోదావరి వరద ఉధృతి స్వల్పంగా తగ్గింది. శనివారం రాత్రి బ్యారేజీ వద్ద పది అడుగుల నీటిమట్టం కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. అలాగే 7,47,782 క్యూసెక్కుల మిగులు జలాలను సముద్రంలోకి విడుదల చేశారు. మూడు డెల్టా కాలువలకు 14,200 క్యూసెక్కుల నీటిని విడిచిపెట్టారు.