NLR: ఉద్యోగులు ప్రజలకు అందుబాటులో ఉండి విధులు నిర్వహించాలని అనంతసాగరం ఎంపీడీవో ఐజాక్ ప్రవీణ్ ఐ తెలిపారు. అనంతసాగరం మండలంలోని కామిరెడ్డిపాడు సచివాలయాన్ని ఆయన శనివారం సందర్శించారు. ఉద్యోగులతో ప్రత్యేక సమావేశం నిర్వహించి 15వ ఆర్థిక సంఘం నిధులతో పారిశుద్ధ్య పనులు చేయించాలని, గ్రీన్ అంబాసిడర్లకు జీతాలు చెల్లించాలని తెలియజేశారు.