ఏ హీరోయిన్ ఎక్కడుంది.. ఎవరితో షికారు చేస్తోంది.. ఎవరెవరితో ఎఫైర్స్ మెయింటేన్స్ చేస్తోంది.. ప్రస్తుతం ఏం చేస్తున్నారు.. ఎక్కడున్నారు.. అంతెందుకు కారవాన్‌లోకి.. వాళ్ల ఇంట్లోకి తొంగి చూసినట్టే మాట్లాడతాడు అతను. ఏదైనా ట్వీట్ పెడితే వెంటనే సోషల్ మీడియాలో వైరల్ అవడం.. అది నిజమనేలా వైబ్ సైట్స్ కూడా రాసేస్తుంటాయి. అసలు అతని చెప్పే దాంట్లో నిజముందా.. లేదా అనేది పక్కన పెడితే.. అతనిచ్చే ఎఫైర్స్ లీకేజీలు మాత్రం సినీ ఫ్యాన్స్‌కు ఫుల్ కిక్ ఇస్తుంటాయి. కానీ స్టార్ హీరోల ఫ్యాన్స్ మాత్రం.. అతన్ని తిట్టినట్టు ఇంకొకరిని తిట్టరేమో అనిపిస్తుంది. అయినా కూడా మనోడు తగ్గేదేలే. హీరోయిన్ల ఎఫైర్స్ అన్ని తనకే తెలుసు అనేలా ట్వీట్స్ చేస్తుంటాడు. అతనెవరో కాదు.. ఉమైర్ సందు. ఇతను ట్విట్టర్లో తనకు తానే బాలీవుడ్ క్రిటిక్ అని చెప్పుకుంటు ఉంటాడు. అలాగే యూఎయి(UAE ) సెన్సార్ బోర్డ్ మెంబర్.. అని సినిమా రిలీజ్‌కు ముందే రివ్యూలు చెబుతుంటాడు. కానీ స్టార్ హీరోలు, హీరోయిన్లకి ఎఫైర్స్ ఉన్నాయంటూ లింకులు పెట్టడంలో మొనగాడు. కామన్ ఆడియెన్స్ అయితే.. నిజంగానే ఉమైర్ చెప్పింది నిజమే అనుకుంటారు. ప్రభాస్, కృతి సనన్ పెళ్లి చేసుకోబోతున్నారన్న పుకారు పుట్టించింది కూడా ఇతనే. ఒక్కసారి అతని ట్విట్టర్ ఓపెన్ చేస్తే.. ఇలాంటి ఎఫైర్స్ ఎన్నో కనిపిస్తాయి. అయితే బన్నీ బర్త్ డే నాడు.. ఏకంగా రష్మిక మందనతో బన్నీ రిలేషన్లో ఉన్నాడని.. త్వరలోనే అల్లు అర్జున్ స్నేహ రెడ్డికి విడాకులు ఇచ్చేసి, రష్మికని పెళ్లాడబోతున్నాడని ఒక ట్వీట్ పెట్టాడు. దీనిపై అల్లు ఫ్యాన్స్ మండిపడుతున్నారు. ఘోరతి ఘోరంగా తిడుతున్నారు. ఏదేమైనా ఉమైర్ చెప్పేదంతా అబద్దమని తెలిసినా.. వార్తలు రాయడం మాత్రం ఆగడం లేదు.